-->
contact us to buy our latest gallery setting

Varun Tej's Loafer first look launched


Varun Tej's latest movie under Puri Jagannadh is Loafer, makers of the movie released first look of this movie on eve of Diwali. Disha Patani pairing with Varun Tej in Loafer

వరుణ్‌ తేజ్‌-పూరి జగన్నాథ్‌-సి.కళ్యాణ్‌ల 'లోఫర్‌' ఫస్ట్‌ లుక్‌ విడుదల

'ముకుంద', 'కంచె' వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు సుప్రీమ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ నిర్మిస్తున్న భారీ చిత్రం 'లోఫర్‌'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ని ఈరోజు(నవంబర్‌ 8) విడుదల చేశారు.

ఈ సందర్భంగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ''వరుణ్‌ తేజ్‌, పూరి జగన్నాథ్‌ల ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న మా 'లోఫర్‌' చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశాం. ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. వరుణ్‌ చాలా డిఫరెంట్‌గా వున్నాడని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. వరుణ్‌తేజ్‌ ఫస్ట్‌టైమ్‌ చేస్తున్న మాస్‌ ఫిల్మ్‌ ఇది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మదర్‌ సెంటిమెంట్‌, హై యాక్షన్‌ ఈ చిత్రంలో వుంటుంది. హీరో క్యారెక్టరైజేషన్‌ మాసీగా వుంటుంది. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో రవితేజకి ఇడియట్‌, మహేష్‌కి పోకిరి, ఎన్టీఆర్‌కి టెంపర్‌, చరణ్‌కి చిరుతల, బన్నికి దేశముదురు ఎలా మాస్‌ సినిమాలు అయ్యాయో అలా వరుణ్‌తేజ్‌కి 'లోఫర్‌' మంచి మాస్‌ సినిమా అవుతుంది. షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో, సినిమా విడుదల తేదీలను అతి త్వరలోనే ప్రకటిస్తాం'' అన్నారు.

వరుణ్‌తేజ్‌, దిశా పటాని, బ్రహ్మానందం, రేవతి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ముకేష్‌ రుషి, సంపూర్ణేష్‌ బాబు, సప్తగిరి, పవిత్ర లోకేష్‌, ఉత్తేజ్‌, భద్రమ్‌, శాండీ, ధనరాజ్‌, టార్జాన్‌, చరణ్‌దీప్‌, వంశీ, రమ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: పి.ఎ.కుమార్‌ వర్మ, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: కె.యస్‌.రాజు, గల్లా రమేష్‌, కిషోర్‌ కృష్ణ, కో డైరెక్టర్‌: శివరామకృష్ణ, కో రైటర్స్‌: కళ్యాణ్‌ వర్మ, కిరణ్‌, ఫైట్స్‌: విజయ్‌, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, ఆర్ట్‌: విఠల్‌ కోసనం, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సమర్పణ: సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, నిర్మాతలు: సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.