-->
contact us to buy our latest gallery setting

Sathi Timmamba release in November


Telugu movie Sathi Timmamba release in November 2015
నవంబర్‌లో 'సతీ తిమ్మమాంబ' విడుదల
ఎస్‌.ఎస్‌.ఎస్‌. ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో భవ్యశ్రీ ప్రధాన పాత్రలో పెద్దరాసు సుబ్రమణ్యం నిర్మిస్తున్న హిస్టారికల్‌ మూవీ 'సతీ తిమ్మమాంబ' సెన్సార్‌ మినహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పెద్దరాసు సుబ్రమణ్యం మాట్లాడుతూ..'అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంతో ఏడెకరాల భూమిలో వెలిసిన తిమ్మమ్మ మర్రిమాను చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. సుమారు 600 వందల సంవత్సరాల చరిత్ర గలిగిన తిమ్మమ్మ మర్రిమాను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు చేసుకుంది. ఈ మాను యొక్క చరిత్రను ప్రజలకు తెలియజేయాలనే గొప్ప సంకల్పంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఇటీవల నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా విడుదల చేసిన ఆడియోకు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్స్‌ కార్యక్రమాలను కూడా పూర్తి చేసి నవంబర్‌ ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..'' అని తెలిపారు.
భవ్యశ్రీ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రంలో ప్రభాకర్‌, రంగనాధ్‌, చంద్రమోహన్‌, రాజశ్రీ, జూనియర్‌ రేలంగి మొదలగు వారు ఇతర తారాగణం.
ఈ చిత్రానికి సంగీతం: బండారు దానయ్యకవి, కెమెరా: షాహిద్‌ హుస్సేన్‌, పాటలు: బండారు దానయ్య కవి, బాలగొండ ఆంజనేయులు, ఎడిటింగ్‌: వినయ్‌,
దర్శకత్వ పర్యవేక్షణ: ఎస్‌. రామ్‌కుమార్‌,
నిర్మాత: పెద్దరాసు సుబ్రమణ్యం,
కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బాలగొండ ఆంజనేయులు.