
Telugu Film hero Rajashekar Jeevitha along with their two daughters met Indian Prime Minister Narendra Modi at his resident, Modi Spent 20 minutes with them
ప్రధాని మోడిని కలిసిన రాజశేఖర్,జీవితలు తెలుగు కథానాయకుడు డాక్టర్ రాజశేఖర్ ఆయన సతీమణి శ్రీమతి జీవితలు నిన్నమన ప్రధాని మోడిని కలిశారు.ఎన్నికల సమయంలో బిజెపి తరుపున ప్రచారంలో జోరుగా పాల్గొనడమే కాకుండా మోడి మీద ఒకపాటను కూడా తయారుచేసి విడుదల చేసిన జీవిత తరువాత కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కూడా కొనసాగుతున్న విషయం విదితమేఢిల్లీ తెలుగు అసోసియేషన్ వారు నిన్నడాక్టర్ రాజశేఖర్, జీవితలకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అదజేశారు. ఈ సందర్భంగా వారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడి గృహానికి వెళ్ళి కలిశారు. ప్రధాన్ని రాజశేఖర్ దంపతులను సాదరంగా ఆహ్వానించి 20 నిముషాల సేపు వీరితో సంభాషించారు.ఈసందర్భంగా పలు అంశాలు వీరి మధ్య చర్చకు రావడం జరిగింది.ముఖ్యంగా రాజశేఖర్ తయారు చేసి ఇచ్చే ప్రత్యేక మందు గురించి ప్రధాని అడిగితెలుసుకుని ఆసక్తిగా వినడం జరిగింది. ప్రధాని నరేంద్రమోడి తాను ఎంత బిజీగా ఉన్నప్పటికి రాజశేఖర్ దంపతులతో 20 నిముషాలు మాట్లాడటం పట్లవారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.