Aksha pairing with Nandamuri Balakrishna, in his upcoming movie Dictator, Aksha chosen as 1 of 3 heroines, Anjali and Sonal playing other two roles. Srivas directing this powerful action entertainer
నందమూరి బాలకృష్ణ సరసన అక్ష!
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా 'డిక్టేటర్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థతో కలిసి వేదాశ్వ క్రియేషన్స్ అసోసియేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. మంచి మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన శ్రీవాస్ ఈ చిత్రాన్ని బాలకృష్ణ అభిమానులు, ఇతర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కథానుసారం మరో నాయికకు కూడా స్థానం ఉంది. ఈ పాత్రకు అక్షను ఎంపిక చేశామని శ్రీవాస్ తెలిపారు. 'రైడ్', 'కందిరీగ' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్ష కెరీర్ కి మంచి బ్రే్క్ ఇచ్చే విధంగా ఈ పాత్ర ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ముగ్గురు కథానాయికల పాత్రలు సినిమాకి కీలంగా నిలుస్తాయని శ్రీవాస్ తెలిపారు.
మరిన్ని విశేషాలను దర్శకుడు శ్రీవాస్ తెలియజేస్తూ - ‘'ఇది పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే చిత్రమవుతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా స్టయిలిష్ లుక్ తో కనపడతారు. ఈరోస్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించడం ఆనందంగా ఉంది'' అన్నారు.
రవికిషన్, షాయాజీ షిండే, నాజర్, పృథ్వి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయడు, డైలాగ్స్: ఎం.రత్నం, రచన: కోన వెంకట్, గోపీ మోహన్, రచనా సహకారం: శ్రీధర్ సీపాన, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.