-->
contact us to buy our latest gallery setting

Mama Manchu Alludu Kanchu first look released


Allari Naresh, Mohan Babu starring Mama Manchu Alludu Kanchu movie first look released on occasion of Dussera

‘మామ మంచు..అల్లుడు కంచు’ ఫస్ట్ లుక్ విడుదల

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్న విలక్షణ నటుడు డా.మంచు మోహన్ బాబు. నాయకుడుగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా ఇలా ఆయన చేయని పాత్ర లేదు. ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు ప్రాణం పోయడం ఆయనకే చెల్లింది. నటుడుగానే కాదు నిర్మాతగా కూడా లక్ష్మీ ప్రసన్నపిక్చర్స్ బ్యానర్ పై 50కు పైగా చిత్రాలను నిర్మించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఆయనలోని విలక్షణతే ఆయన్ను తెలుగు ప్రేక్షకులకు చేరువచేసింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 561 సినిమాల్లో నటించిన ఘనత కలెక్షన్ కింగ్ మోహన్ బాబుదే. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న 181వ చిత్రం ‘మామ మంచు..అల్లుడు కంచు’.

డా. మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ అనగానే గుర్తొచ్చే చిత్రం 'అల్లరి మొగుడు'. వెండితెరపై ఈ కాంబినేషన్ చేసిన మేజిక్ ని అంత సులువుగా మర్చిపోలేం. మోహన్ బాబు చిత్రాల్లో సిల్వర్ జూబ్లి సాధించిన సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన వాటిలో 'అల్లరి మొగుడు'కి ప్రముఖ స్థానముంది. ఇప్పుడు మరోసారి మోహన్ బాబు,రమ్యకృష్ణ, మీనా కాంబినేషన్ లో ‘మామ అల్లుడు..అల్లుడు కంచు..’ రూపొందుతోంది. అయితే ఈసారి ఈ కాంబినేషన్ కి 'అల్లరి' నరేష్ తోడయ్యారు. నరేష్ సరసన పూర్ణ కథానాయికగా నటిస్తుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి తీర్చిదిద్దారు. దసరా సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు.

నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ ‘’నాన్నగారు ఇప్పటి వరకు 561 చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు ‘మామ మంచు- అల్లుడు కంచు’ సినిమా ఆయన హీరోగా నటించిన 181వ చిత్రం. అలాగే ఈ చిత్రంలో అల్లరి నరేష్,పూర్ణ నటిస్తున్నారు. అల్లరి నరేష్ కు ఈ చిత్రం 50వ సినిమా. డిఫరెంట్ కాంబినేషన్ లో అవుటండ్ అవుంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం ఒక పాట మినహా మొత్తం పూర్తయింది. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సినిమాను చక్కగా డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా బాగా వస్తుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

నటీనటులు :

డా.మోహన్ బాబు, నరేష్, రమ్యకృష్ణ, మీనా, పూర్ణ, వరుణ్ సందేశ్, అలీ, కృష్ణభగవాన్, జీవా, రాజా రవీంద్ర, సోనియా, సురేఖా వాణి, హృదయ, మౌనిక, ధనరాజ్, చమ్మక్ చంద్ర , ఖయ్యూమ్, సాయి పంపాన, చిట్టిబాబు, అనంత్, సత్తెన్న, దాసన్న, అంబటి శీను

టెక్నిషియన్స్ :

మాటలు: శ్రీదర్ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, శ్రీమణి, డ్యాన్స్: రాజు సుందరం, బృంద, శ్రీధర్, విద్యాసాగర్, ఆర్ట్: చిన్నా, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: బాలమురుగన్, సంగీతం: అచ్చు, రఘకుంచె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విధ్యానిర్వాణ, నిర్మాత: విష్ణు మంచు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.