‘మగాళ్ళు వట్టి మాయగాళ్ళే’
ప్రముఖ దర్శక రచయిత పోలూరి ఘటికాచలం రచనలో, కుమారి స్ఫూర్తి సమర్పణలో జె. ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ నిర్మాణ సారధ్యంలో నూతన దర్శకుడు సంజీవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మగాళ్ళువట్టి మాయగాళ్ళే. విజయదశమి సందర్భంగా ఈ చిత్రం పాటల రికార్డింగ్ భోలే డిజిటల్ రికార్డింగ్ థియేటర్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్ రికార్డింగ్‌ను ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా సాయిసిరి రచించిన ‘తమన్నా.. సమంతా.. రకుల్‌ప్రీత్.. కాజల్‌ల.. డేట్స్ అడిగే హీరోలు’ అనే సాహిత్యానికి భోలే సంగీత దర్శకత్వంలో స్వరాలను సమకూర్చారు.
నూతన నటుడు గోపి హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో ‘మద్ మస్త్ బర్ఖా’ చిత్రంతో బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న లీనాకపూర్ కథానాయిక. ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయి అని, నవంబర్ ప్రదమార్థంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంటుందని, దర్శకుడు సంజీవ ఈ సందర్భంగా తెెలియజేశారు.



.jpeg)










with valid identity and proof we will remove that item right away