-->
contact us to buy our latest gallery setting

ఐర‌న్‌లెగ్ శాస్త్రి ఫ్యామిలికి స‌హ‌యం చేసిన‌ బ‌ర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్ బాబు



Burning star Sampoornesh Babu once again proved his kind heart by lending his helping hand to veteran comedian popularly known as Ironleg Sastri family.

ఐర‌న్‌లెగ్ శాస్త్రి ఫ్యామిలికి స‌హ‌యం చేసిన‌ బ‌ర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్ బాబు

ఎన్నో చిత్రాల‌తో ఎన్నో ర‌క‌ర‌కాల పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని న‌వ్వించిన క‌మెడియ‌న్ ఐర‌న్‌లెగ్ శాస్త్రి మ‌ర‌ణం త‌రువాత త‌న ఫ్యామిలి ఆర్థింకంగా ఎన్నో ఇబ్బందుల‌కి గుర‌వుతున్న విష‌యం తెలిసిందే. హ్రుద‌య‌కాలం చిత్రంతో బ‌ర్నింగ్‌స్టార్‌ గా ఎదిగిన సంపూర్ణేష్ బాబు మీడియా ద్వారా తెలుసుకుని, స్పందించి ఐర‌న్‌లెగ్ శాస్త్రి ఫ్యామిలికి త‌న వంతు సాయం చేశారు.

బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. గురువుగారు ఐర‌న్‌లెగ్ శాస్త్రి తెలుగు ప్రేక్ష‌కుల్ని ఏవిదంగా న‌వ్వించారో అంద‌రికి తెలుసు. ఆయ‌న హ‌స్య‌నికి విలువ క‌ట్ట‌లేము. అలాంటి ఆయ‌న ఫ్యామిలి ఇప్ప‌డు ఆర్ధికంగా ఇబ్బందిప‌డుతుంద‌నే విష‌యం మీడియా ద్వారా విని ఆయ‌న కుమారుడు ప్ర‌సాద్ కాంటాక్ట్ ప‌ట్టుకుని నాకు తోచిన స‌హ‌యం వారికి 25,000 రూపాయిల చెక్ ని అందించాను. ఇలానే మ‌న ప‌రిశ్ర‌మ‌లోనివారంతా త‌మ‌కు తోచిన విధంగా వారి ఫ్యామిలి ని ఆదుకోవాల‌ని కోరుకుంటున్నాను.. అని అన్నారు

ఐర‌న్‌లెగ్ శాస్త్రి కుమారుడు ప్ర‌సాద్ మాట్లాడుతూ.. సంపూర్టేష్ బాబు గారు మా ఫ్యామిలి పరిస్థితి తెలుసుకుని మాకు స‌హ‌యాన్ని అందించినందుకు వారికి ధ‌న్య‌వాదాలు. నాన్న గారి మ‌ర‌ణం త‌రువాత మా ఫ్యామిలి చాలా ఆర్థికంగా, నిత్య‌వ‌స‌ర వ‌స్తువ‌ల‌కు కూడా ఇబ్బంది ప‌డుతున్నాము. మాకు ప‌రిశ్ర‌మ‌లోని పెద్ద‌లు కూడా మా ఫ్యామిలి ని ఆదుకుంటార‌ని ఆశిస్తున్నాం.. అని అన్నారు