
Raj Tarun's latest Telugu movie Seethamma Andalu Ramayya sitralu details news
ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా రూపొందిస్తున్న ‘కుమారి 21 ఎఫ్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు రాజ్ తరుణ్ నటిస్తున్న మరో చిత్రం కూడా షూటింగ్‌ను పూర్తిచేసుకొని, నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు, వినోదానికి పెద్ద పీటవేశాం. రాజ్‌తరుణ్ పాత్ర సరికొత్తగా వుంటుంది. ఈ చిత్రంతో అర్తన అనే నూతన హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతుంది. నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలోని పతాక సన్నివేశాలను భారీఖర్చుతో చిత్రీకరించాం. చిత్రంలో పతాక సన్నివేశాలు హైలైట్‌గా వుంటాయి. తప్పకుండా ఈ చిత్రం రాజ్‌తరుణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుంది. చిత్రీకరణ పూర్తిచేసుకొని నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. నవంబరులో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. రాజ్‌తరుణ్, అర్తన, రణధీర్, రాజా రవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సుద్ధాల అశోక్‌తేజ, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: విశ్వ, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి వెంకటరమణ, సమర్పణ; శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు, కథస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.












with valid identity and proof we will remove that item right away