-->
contact us to buy our latest gallery setting

శివబాలాజీ పుట్టినరోజు సందర్భంగా ‘స్నేహమేరా జీవితం’ మోషన్ పోస్టర్ విడుదల

Chandamama, Arya, Sambo Siva Sambo fame Telugu hero Sivabalaji himself producing a movie Snehamera Jivitham

‘ఇది మా అశోక్‌గాడి ల‌వ్‌స్టోరీ’ సినిమాతో తెరంగేట్రం చేసి ‘ఆర్య’, ‘సంక్రాంతి’, ‘పోతేపోనీ’, ‘చంద‌మామ‌’, ‘శంభో శివ శంభో’వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల వద్ద తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివ బాలాజీ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. ధన్ విన్ కాంగుల సమర్పణలో గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘స్నేహమేరా జీవితం’ అనే టైటిల్ ను నిర్ణయించారు. ‘పడ్డానండీ ప్రేమలో మరి’వంటి క్యూట్ లవ్ స్టోరీని రూపొందించిన దర్శకుడు మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అక్టోబర్ 14న శివబాలాజీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. 1980 బ్యాక్ డ్రాప్ లో ఒక నిజ ఘటనను ఆధారంగా చేసుకుని, ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథే ఈ సినిమా. ఇందులో ప్రేక్షకులు కోరుకునే ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ చిత్రంలో శివబాలాజీతో పాటు ఓ ప్రముఖ నటుడు నటించనున్నారు. సినిమా మొదటి షెడ్యూల్ పూర్తైంది. సినిమా చాలా బాగా వస్తుంది. సునీల్ కశ్యప్ అద్భుతమైన సంగీతం, భరణి కె.ధరణ్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని దర్శక నిర్మాతలు తెలియజేశారు.

శివబాలాజీ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: ధన్ విన్, కెమెరా: భరణి కె.ధరణ్, మ్యూజిక్: సునీల్ కశ్యప్, మాటలు: కిట్టు విస్సా ప్రగడ, కథా విస్తరణ: విద్యాసాగర్ రాచకొండ, పాటలు: బాలాజీ, చైతన్య వర్మ,నిర్మాత: శివబాలాజీ మనోహరన్, దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి.