New Telugu movie Ika Selav completed half shooting, Ravi and Deepthi playing leading roles in Ika Selav
50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రేమ కథా చిత్రం ఇక సె...లవ్
గ్రీన్ సన్ ఇన్నోవేటివ్స్, జైహిత క్రియేషన్స్ సంయుక్తంగా...బస్టాప్, గ్రీన్ సిగ్నల్ ఫేం సాయి రవి, కన్నడ నటి దీప్తి హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ఇక సె...లవ్. డుంగ్రోత్ నాగరాజ్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 9న ఖమ్మం లోని లక్ష్మీనరసింహ స్వామి గుడిలో ప్రారంభమై.. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటివరకు 50 శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో షూటింగ్ పూర్తవుతుంది. ఏప్రిల్ నెలలో నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే నెలలో రిలీజ్ కానుందని నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ... వాల్మీకి తర్వాత రామాయణాన్ని ఎంతమంది రచించినా దేని ప్రత్యేకత దానికే ఉన్నట్టు.... సెల్యులాయిడ్ పై ఎన్ని ప్రేమకథలు వచ్చినా... ఈ చిత్రం మాత్రం ప్రత్యేక ప్రేమకథగా..నిలిచిపోతుంది. అని అన్నారు.
సీనియర్ కెమెరామెన్ వి.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని గన్నవరపు చంద్రశేఖర్, పీర్యానాయక్, రవి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రచన, దర్శకత్వం - డుంగ్రోత్ నాగరాజ్

.jpeg)

with valid identity and proof we will remove that item right away